: డ్రాగన్ ను దాటేసిన భారత ‘వృద్ధి’ వేగం!


భారత ఆర్థిక రంగ వృద్ధి వేగం పుంజుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి క్వార్టర్ లో అంచనాలు అందుకోవడంలో కాస్తంత వెనుకబడ్డ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రెండో క్వార్టర్ (జూలై-సెప్టెంబర్)లో మాత్రం అంచనాలు దాటేసింది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా ఆర్థిక రంగాన్ని కూడా భారత్ దాటేసింది. రెండో క్వార్టర్ లో చైనా జీడీపీ 6.9గా నమోదు కాగా, భారత జీడీపీ మాత్రం ఏకంగా 7.4 శాతంగా నమోదైంది. అంటే, డ్రాగన్ కంటే 0.5 మేర అధిక వృద్ధి సాధ్యమైందన్న మాట. దేశీయ డిమాండ్ ను అందుకునేందుకు ఇటీవల ఉత్పత్తి రంగంలో నమోదైన వేగమే ఈ వృద్ధికి కారణమని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక జీఎస్టీ పన్నుల విధానం అమలులోకి వస్తే, వచ్చే ఏడాది ఈ వృద్ధి 8 శాతాన్ని తాకడం ఖాయమేనన్న వాదన కూడా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News