: తిరుమల వెంకన్నకూ కల్తీ నెయ్యి మకిలి అంటిందా?...ఆరా తీస్తున్న టీటీడీ అధికారులు


విజయవాడ కేంద్రంగా పలు ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ నెయ్యి విక్రయాలు నెరపుతున్న ఆవుల ఫణికుమార్ వ్యవహారంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఓ మారు అతడి నకిలీ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపగా, కాస్తంత గ్యాప్ ఇచ్చిన ఫణికుమార్ తిరిగి తన దందాను మొదలుపెట్టాడు. తాజాగా మరోసారి పోలీసులు అతడి దందాపై ముప్పేట దాడి చేశారు. దాడుల్లో లభించిన పక్కా ఆధారాలతో ఫణికుమార్ ను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు కల్తీ దందా గుట్టు విప్పుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా ఫణికుమార్ ప్రముఖ బ్రాండ్ల పేరిట నకిలీ నెయ్యిని తిరుమల వెంకన్న ఆలయానికి సరఫరా చేశాడట. దీంతో షాక్ తిన్న పోలీసులు ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు చేరవేశారు. పలుమార్లు నకిలీ నెయ్యి తిరుమల కొండకు చేరుకున్న మాట వాస్తవమేనని నిర్ధారించిన టీటీడీ అధికారులు, సదరు నకిలీ నెయ్యి స్టాకును తిప్పిపంపామని చెబుతున్నారు. రెండేళ్ల పాటు సాగిన ఈ దందాలో నకిలీ నెయ్యి మకిలి వెంకన్న ప్రసాదానికి అంటే ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యావత్తు భక్త జనం అయోమయంలో కూరుకుపోయారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ విషయంపై మరింత పరిశీలన జరిపిన తర్వాత కాని స్పష్టమైన ప్రకటన వెల్లడించలేమని అటు పోలీసులతో పాటు ఇటు టీటీడీ అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News