: టీడీపీ జనచైతన్య యాత్రలు నేటి నుంచే... వేమూరులో ప్రారంభించనున్న చంద్రబాబు


ఏపీలో అధికార టీడీపీ నేటి నుంచి జనచైతన్య యాత్రల పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దాదాపు రెండు వారాల పాటు కొనసాగనున్న ఈ యాత్రల్లో పార్టీ, ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనల్లో భాగంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధానంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగనున్నాయి. ఈ యాత్రలను నేటి ఉదయం గుంటూరు జిల్లా వేమూరులో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వేమూరుతో పాటు మరో మూడు గ్రామాల్లోనూ చంద్రబాబు పర్యటిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా రెండు గ్రామాల్లో జన చైతన్య యాత్రల్లో పాలుపంచుకుంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు నిన్న ప్రకటించారు.

  • Loading...

More Telugu News