: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ యువరాజ్ సింగ్ పెట్టుబడులు
భారత్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న సంస్థ యూవి కెన్ వెంచర్స్. వ్యాపారం ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఇప్పటికి తొమ్మిది సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. తాజాగా ముంబయిలో భావిక్ వోరా ప్రారంభించిన బ్లాక్ వైట్ ఆరెంజ్ బ్రాండ్స్ అనే సంస్థలో యువీ సంస్థ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వాణిజ్యం, రిటైల్, పంపిణీ తదితర రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తుంది. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ, సృజనాత్మక వ్యాపారాల్లో తమ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.