: స్వల్పంగా తగ్గిన ‘పెట్రో’ ధరలు
‘పెట్రో’ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ పై లీటర్ కు 58 పైసలు, డీజిల్ కు 25 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా సవరించిన ‘పెట్రో’ ధరల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.60.48 పైసలు కాగా, డీజిల్ ధర రూ.46.55 పైసలుగా ఉంటుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓఎల్) పేర్కొంది. కాగా, నవంబర్ 15 న ‘పెట్రో’ ధరలను రివైజ్ చేశారు. దాంతో, అప్పుడు పెట్రోల్, డీజిల్ లు ధరలు వరుసగా 36 పైసలు, 87 పైసలు పెరిగిన విషయం తెలిసిందే.