: రూ.90 తగ్గడంతో... నాలుగు నెలల కనిష్ఠానికి బంగారం ధర
బులియన్ మార్కెట్ లో బంగారం ఈరోజు రూ.90 తగ్గింది. దాంతో నాలుగు నెలల కనిష్ఠానికి చేరింది. 99.0 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ.25,525కు చేరింది. అటు వెండి ధర కూడా ఇవాళ తగ్గింది. రూ.100 తగ్గి కేజీ వెండి ధర రూ.34,000కు చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వంటి కారణాల వల్ల బంగారం ధర దిగొచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.