: ఏపీ కేబినెట్ భేటీ దోపిడీ దొంగలు సమావేశమైనట్టు ఉంది: పార్థసారథి
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచేలా ఉందని... టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని వైకాపా అధికార ప్రతినిధి పార్థసారథి ఆరోపించారు. కేబినెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించడమే మానేశారని మండిపడ్డారు. దోపిడీ దొంగలు సమావేశమైనట్టుగా కేబినెట్ మీటింగ్ జరుగుతోందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వెలువడలేదని విమర్శించారు. 'ఎవరెలాగైనా చావండి మాకేంటి?' అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై నానాటికీ వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.