: మోదీజీ! ఆ పని చేస్తే మతపరమైన అడ్డంకులు తొలగుతాయి: శివసేన
మతపరమైన అడ్డంకులు లేకుండా ఉండాలంటే అన్ని మతాల వారికి భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంథం కావాలని, దానిపైనే అందరూ ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి శివసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయాన్ని రాసింది. భారత రాజ్యాంగం ముందు అన్ని మతాల వారు సమానమేనని గతంలో శివసేన పార్టీ అధినేత బాల్ థాకరే పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆ పత్రిక గుర్తు చేసింది. కోర్టుల్లో మత గ్రంథాలపై కాకుండా రాజ్యాంగం పైనే ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని శివసేన కోరింది.