: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓయూ పీఎస్ లో ఫిర్యాదు
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 10న వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ అడ్డుకోవాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని విద్యార్థి నాయకులు చెప్పారు. ప్రజల ఆహార అలవాట్లను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.