: హెచ్ఐవీ చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందిస్తాను: హీరోయిన్ సమంత


హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారులకు ప్రత్యేక పోషకాహారాన్ని రేపు అందించనున్నట్లు దక్షిణాది సినీ హీరోయిన్ సమంత పేర్కొంది. సమంత తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తన పర్యవేక్షణలో ‘ప్రత్యూష సపోర్ట్’ అనే స్వచ్ఛంద సంస్థను ఆమె నిర్వహిస్తోంది. డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవీ చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సుమారు వంద మంది చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందించునున్నట్లు తెలిపింది. హెచ్ఐవీ చిన్నారుల్లో చాలామందికి పోషకాహార సమస్య ఉందని.. ప్రత్యేక ఆహారం అందజేయడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని సమంత పేర్కొంది.

  • Loading...

More Telugu News