: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను కోల్ కతా కంపెనీకి అప్పగించిన హైకోర్ట్
ఖాతాదారులను మోసం చేసిన అగ్రిగోల్డ్ కేసులో ఇవాళ ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ విచారణ, బినామీ ఆస్తుల అమ్మకాలపై కోర్టు ఆరా తీసింది. ఆస్తుల వేలం నిర్వహించలేమని ఢిల్లీకి చెందిన సీ-1 కంపెనీ కోర్టుకు చెప్పింది. దాంతో కోల్ కతాకు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ టీసీ కంపెనీ ఆస్తుల వేలం నిర్వహించేందుకు ముందుకువచ్చింది. ఈ కేసు విచారణ అంశంలో మీడియాను నియంత్రించాలంటూ అగ్రిగోల్డ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. తాము మీడియాను నియంత్రించలేమని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.