: లోక్ సభలో 'అసహనం' అంశంపై చర్చ ప్రారంభం
గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా వివాదం రేపుతున్న అసహనం, దానికి సంబంధించిన సంఘటనలపై లోక్ సభలో నేడు చర్చ ప్రారంభమైంది. 193 సెక్షన్ ప్రకారం చర్చ చేపట్టాలని విపక్షాలు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు నోటీసులు ఇచ్చాయి. దాంతో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అసహనంపై చర్చ ప్రారంభించారు. ఈ క్రమంలో సీపీఎం సభ్యుడు మహమ్మద్ సలీం మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ పై సలీం చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.