: బాక్సైట్ శ్వేతపత్రంపై బృందాకారత్ విమర్శలు
ఇటీవల బాక్సైట్ పై ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై సీపీఎం నేత బృందాకారత్ విమర్శలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని ఆరోపించారు. పీఎంవో సూచనలతోనే ఆ పత్రాన్ని విడుదల చేశారన్నారు. రాజ్యాంగ సవరణను తుంగలో తొక్కుతున్నారని విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ లేవనెత్తిన ఏ ఒక్క అంశానికి శ్వేతపత్రంలో సమాధానం లేదని, కొన్ని దేశాలకు, కంపెనీలకు ఉపయోగపడేలా ఇది ఉందని వ్యాఖ్యానించారు. తాము బాక్సైట్ శ్వేతపత్రాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.