: బీహార్ శాసనమండలి ఆర్జేడీ పక్షనేతగా రబ్రీదేవి
ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ హవా మళ్లీ మొదలైంది. ఇప్పటికే తన ఇద్దరు కుమారులను ఎమ్మెల్యేలుగా చేసి మంత్రి పదవులు ఇప్పించుకున్న లాలూ, తాజాగా భార్య రబ్రీదేవికి కూడా పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. గతంలో బీహార్ సీఎంగా చేసిన ఆమెను ఇప్పుడు ఆ రాష్ట్ర శాసనమండలిలో రాష్ట్రీయ జనతాదళ్ పక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రబ్రీ పేరును ఖరారు చేశారు. మరోవైపు లాలూ రెండో కుమారుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు ఆర్జేడీ శాసనసభా పక్ష నేత పదవి కూడా కట్టబెట్టారు.