: భారత్ పై మరోమారు నోరు పారేసుకున్న అండర్ వరల్డ్ డాన్ వియ్యంకుడు


అండర్ వరల్డ్ డాన్, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో వియ్యమొంది, నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేశాడు. ఆ తర్వాత అవకాశం చిక్కిన ప్రతిసారీ బీసీసీఐపైనే కాక భారత ప్రభుత్వంపై కూడా అతడు నోరు పారేసుకున్నాడు. భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ కోసం ఇరు బోర్డులు యత్నిస్తున్న క్రమంలో జావెద్ మరోమారు తన నోటికి పని చెప్పాడు. ‘‘మాట నిలబెట్టుకోవడంలో భారత్ ను నమ్మలేం’’ అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇరు దేశాల మధ్య సిరీస్ కు పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సిరీస్ ఆరంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో అతడు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల బోర్డులను అయోమయంలో పడేశాయి. ‘‘ద్వైపాక్షిక సిరీస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది భారతే. నిత్యం పాక్ పై ఆరోపణలు గుప్పించడం, పాక్ ను తక్కువ చేసి మాట్లాడడమే వారి పని. అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ను పునరుద్ధరించేందుకు పీసీబీ మాత్రం తన వంతు యత్నాలు చేస్తోంది’’ అని అతడు వ్యాఖ్యానించినట్లు పాక్ పత్రిక ‘డాన్’ నిన్న ఓ కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News