: ఉత్తర భారతంలో మళ్లీ ప్రకంపనలు


ఉత్తర భారతం మళ్లీ కంపించింది. ఇటీవల ఢిల్లీ, నోయిడా తదితర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించిన కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు 3 గంటల సమయంలో ఢిల్లీ, కాశ్మీర్ లలో పలు చోట్ల భూమి కంపించింది. కాగా, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ నేటి మధ్యాహ్నం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం పొరుగున ఉన్న పాకిస్తాన్, భారత్ లపైనా కనిపించింది.

  • Loading...

More Telugu News