: స్పెయిన్ లో వలలో చిక్కిన భారీ సముద్ర జీవి


స్పెయిన్ లోని సముద్ర జలాల్లో ఉత్తర ఆస్ట్రియా వద్ద వాల్విసియోస జలసంధి సమీపంలో వేటగాళ్లకు భారీ సముద్ర జీవి పట్టుబడింది. సుమారు 33 అడుగుల పొడవున్న స్క్విడ్ (ఆక్టోపస్ ను పోలిన్ జీవి) స్థానిక మత్స్యకారుల వలలకు చిక్కింది. చేపల వేట నిమిత్తం సముద్రంలోని 500 అడుగుల లోతుకు వెళ్లినప్పుడు ఈ స్క్విడ్ చిక్కినట్టు వారు తెలిపారు. 33 అడుగుల పొడవున్న ఈ జీవి 149 కేజీల బరువు ఉందని, అయితే, ఇది మృతి చెందిందని వారు చెప్పారు. దీని శరీరాన్ని భద్రపరిచి, ఉత్తర స్పెయిన్ లోని ది స్టడీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ స్పెసియస్ సంస్థకు అప్పగించారు. దీనిపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ ఇటీవలి కాలంలో ఇంత పెద్ద స్క్విడ్ ను చూడలేదని అన్నారు.

  • Loading...

More Telugu News