: పట్టాలు తప్పిన రైళ్లు... పొగతో ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు!
ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లిఖిమ్ పూర్ జిల్లాలోని భీరా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ఇజాత్ నగర్ గోండా పాసింజర్ రైలు కొంత దూరం వెళ్లిన తరువాత పట్టాలు తప్పింది. దీనిని గమనించిన డ్రైవర్ అత్యవసర బ్రేకు వేసి ట్రైన్ ను ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. మరోపక్క, గూడూరు-పెద్ద పరిగి మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కాగా, షిర్డీ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ట్రైన్ లో ఏసీ బోగీలో పొగ వ్యాపించింది. దీంతో ట్రైన్ లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో ఆప్రమత్తమైన డ్రైవర్ ట్రైన్ ను ఆపేసి, పరిశీలించడంతో బ్రేక్స్ పట్టేయడంతో పొగలు వ్యాపించినట్టు గుర్తించారు. దీంతో మరమ్మతులు చేపట్టి సరిచేశారు.