: కెమెరామేన్ కి 'బాహుబలి' నిరాశ కలిగించిందట!
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. బాలీవుడ్ సైతం బాహుబలి విజయానికి సలాం చేసింది. బాహుబలి సినిమాలో నటించి ఉంటే బాగుండేదని సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ కూడా అన్నారంటే... ఆ సినిమా పవర్ ఏంటో అర్థమవుతుంది. అలాంటి సినిమా ఓ స్టార్ టెక్నీషియన్ కి నిరాశ కలిగించిందట. అతడే టాప్ కెమెరామెన్ సెంథిల్. సినిమాలో గ్రాఫిక్స్ కు సంబంధించి చిన్నచిన్న పొరపాట్లు సెంథిల్ ను నిరాశపరిచాయట. ఈ విషయాన్ని 'ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో పాల్గొన్న సందర్భంగా ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఏదేమైనప్పటికీ బాహుబలి-2ని మరింత క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పాడు.