: బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు... మెదక్ జిల్లాలో ఘటన
సాగు నీటి కోసం పొలాల్లో తవ్వుతున్న బోరు బావులు ఇప్పటిదాకా చిన్నారులను బలి తీసుకోగా, తాజాగా తాగు నీటి కోసం జనావాసాల మధ్యన తవ్విన బోరు బావి వద్ద కూడా ఈ తరహా ప్రమాదం చోటుచేసుకుంది. జనావాసాల మధ్య తవ్విన బోరు బావి సమీపంలో ఆడుకుంటున్న క్రమంలో మూడేళ్ల బాలుడు రాకేశ్ అందులో పడిపోయాడు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని వెనువెంటనే గమనించిన బాలుడి తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో బాలుడిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యలను ప్రారంభించింది.