: హర్యానా మంత్రికి షాకిచ్చిన మహిళా ఐపీఎస్


హర్యాణా ఆరోగ్య, క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ కు మహిళా ఐపీఎస్ అధికారి షాకిచ్చారు. రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం దొంగతనాలు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా ఐపీఎస్ అధికారి సంగీతా కాలియా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో దొంగతనాలు పెరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మంత్రి ఆమెను నిలదీశారు. మద్యం దొంగతనాలపై వేల కేసులు నమోదు చేశామని, చాలా మందిని న్యాయస్థానం ముందు నిలబెట్టామని ఆమె మంత్రికి సమాధానం చెప్పారు. బెయిలు తీసుకున్న అనంతరం బయటికి వచ్చిన నేరగాళ్లే మళ్లీ మళ్లీ నేరాలు చేస్తున్నారని ఆమె మంత్రికి తెలిపారు. ఆమె సమాధానానికి సంతృప్తి చెందని మంత్రి ఆమెను గెటౌట్ అని ఆదేశించారు. దీనికి ఆమె తాను వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో మంత్రి అనిల్ విజ్ సమావేశ మందిరం విడిచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News