: ఉద్దవ్ ఠాక్రే ను చెంపదెబ్బ కొడితే రెండు లక్షలు ఇస్తా: తవ్ బీక్
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎవరైనా చెంపదెబ్బ కొడితే రెండు లక్షల రూపాయలు ఇస్తామని తమిళనాడు తవ్ హీద్ జమాత్ సంస్థ ప్రకటించింది. అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పంజాబ్ కు చెందిన శివసేన విభాగం లూధియానాలో అమీర్ ఖాన్ బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించి, అమీర్ ఖాన్ ను చెంప దెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళనాడు తవ్ హీద్ జమాత్ సహాయ ప్రధాన కార్యదర్శి తవ్ బీక్ మాట్లాడుతూ, ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టిన వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు తాము బెదిరిపోమని, ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.