: ప్రభావవంతుల జాబితాలో జగన్ పేరు చేర్చడం దురదృష్టకరం: టీడీపీ


'ఇండియన్ ఎక్స్ ప్రెస్' వందమంది ప్రభావవంతుల జాబితాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును చేర్చడంపై టీడీపీ విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఆయన ఆస్తులపై పూర్తి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిందని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన జగన్ పేరును చేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లడిన గాలి, ఆరు లక్షల మెజార్టీతో కడప ఎంపీగా గెలవడం పెద్ద విజయమేమి కాదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News