: అమీర్ ఖాన్ పై సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న చర్చ


అమీర్ ఖాన్ పై సోషల్ మీడియాలో జోరుగా ఓ చర్చ సాగుతోంది. అమీర్ ఖాన్ ను దూరం చేసుకుందామా? అంటూ పలువురు నెటిజన్లు ఆసక్తకరమైన వాదన చేస్తున్నారు. బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ కు ఆశ్రయమిచ్చి గొప్ప మనసు చాటుకున్న భారత దేశంలో మతసహనం ఉందా? అనేది ఆ చర్చ సారాంశం. నిజమే, భారతదేశంలో మత సహనం నెలకొని ఉందని అంగీకరిద్దాం. అయితే...ముంబైలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'శాటానిక్ వర్సెస్' నవలను రాసిన సల్మాన్ రష్దీని జైపూర్ లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ కు రానీయలేదే...దీనిని ఏమనాలి? అని అడుగుతున్నారు. హిందూ దేవతల బొమ్మలు నగ్నంగా చిత్రీకరించాడన్న కారణంతో ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్ ను దేశం నుంచి బహిష్కరించామే, జీవిత చరమాంకంలో పుట్టిన గడ్డకు వస్తానన్నా కూడా రానీయలేదే, దీనిని ఏమనాలి? అంటూ నిలదీశారు. ఇప్పుడు దేశానికే గర్వకారణమైన నటుడు, పసిపిల్లలపై విద్యను రుద్దవద్దు అంటూ 'తారే జమీన్ పర్', బలవంతపు చదువులు ఉండకూడదు, ఏ రంగంలోనైనా ఇష్టంగా ప్రవేశించాలని చాటిన '3 ఇడియట్స్', తీవ్రవాదులకు సింహ స్వప్నంగా నిలిచిన 'సర్ఫరోష్', ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన 'లగాన్', 'మంగళ్ పాండే', మతంలో పేరుకుపోయిన దుస్సాంప్రదాయాలను ప్రశ్నిస్తూ తీసిన 'పీకే' వంటి సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ సంపాదించుకున్న అమీర్ ఖాన్ ను కూడా దేశం నుంచి బహిష్కరిద్దామా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News