: లక్షన్నర ఎకరాలు నష్టపోతే... 18 వేల ఎకరాలే చూపుతున్నారు: జగన్
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం చినగొళ్లపాలెంలో వైకాపా అధినేత జగన్ నేడు పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పైగా పంట నష్టం జరిగితే... అధికారులు మాత్రం కేవలం 18 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్టు చూపెడుతున్నారని మండిపడ్డారు. వరదల వల్ల నష్టపోయిన రైతుల వద్దకు ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాలేదని... ఇది అత్యంత దారుణమని విమర్శించారు.