: 75 శాతం పాడైన కాలేయంతో బతుకుతున్నా: అమితాబ్ సంచలన వ్యాఖ్యలు
ప్రఖ్యాత సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కాలేయం 75 శాతం పాడైపోయిందని... 25 శాతం బాగున్న కాలేయంతోనే తాను జీవితాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో 'కూలీ' సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు తనకు 40 బాటిళ్ల రక్తం ఎక్కించారని... వాటిలో ఒక దాన్నుంచి తనకు హెపటైటిస్-బి వైరస్ సంక్రమించిందని తెలిపారు. అయితే, 2004 వరకు తనకు ఆ సంగతి తెలియనే లేదని చెప్పారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా స్థిరంగా మందులు తీసుకోవడం వల్లే తాను సాధారణ జీవితం గడుపుతున్నానని బిగ్ బీ తెలిపారు. కాలేయ ఆరోగ్యానికి సంబంధించి అత్యంత శ్రద్ధ అవసరమని ఆయన సూచించారు.