: రాహుల్ కు చేదు అనుభవం నిజం కాదు: బెంగళూరు విద్యార్థిని


బెంగళూరులోని ప్రముఖ మౌంట్ కార్మెల్ కళాశాల విద్యార్థినులతో రాహుల్ గాంధీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛభారత్’ విజయవంతమైందా? అన్న ఆయన ప్రశ్నకు ‘ఎస్’ అనే సమాధానం రావడంతో రాహుల్ బిక్కమొహం వేశారంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇదంతా నిజం కాదని, అక్కడ జరిగిన దాని కంటే ఎక్కువ చేసి చెబుతున్నారంటూ అదే కళాశాలకు చెందిన ఎలిగ్జిర్ నహర్ పేర్కొంది. ఈ మేరకు ఒక లేఖ రాసి, దానిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ‘An Open Letter to #?RahulStumped Enthusiasts’ అనే పేరుతో పోస్ట్ చేసిన ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించింది. 1,437 పదాలు ఉన్న ఈ లేఖలో రాహుల్ వేసిన ప్రశ్నలు, వాటికి విద్యార్థులు స్పందించిన తీరు ఏ విధంగా ఉందో రాసింది. రాహుల్ ప్రశ్నలకు మిశ్రమ స్పందన వచ్చిందని, ఆయన చాలా సరదాగా మాట్లాడారని నహర్ తెలిపింది. కేవలం స్వచ్ఛ భారత్ పైనే కాకుండా మేకిన్ ఇండియా పై కూడా రాహుల్ ప్రశ్నలు వేశారని చెప్పింది. దీనికి కూడా మిశ్రమ స్పందనే వచ్చిందని తెలిపింది. మేక్ ఇన్ ఇండియా ద్వారా మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని ‘మీరు నమ్ముతున్నారా?’ అనే ప్రశ్నకు చాలా మంది విద్యార్థినులు ‘నో’ అనే సమాధానం చెప్పారని ఆ బహిరంగ లేఖలో నహర్ పేర్కొంది.

  • Loading...

More Telugu News