: కాలు కదిపితే విమానమే... పదేళ్లలో డెలివరీ కానున్న జెట్ల సంఖ్య 9,200!


వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,200 బిజినెస్ జెట్ విమానాలు డెలివరీ కానున్నాయి. వీటి విలువ 270 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 18.03 లక్షల కోట్లు) ఉంటుందని, పదేళ్ల తరువాత చిన్నా, పెద్దా కార్పొరేట్ కంపెనీలు ఏ పనిమీద వెళ్లాలన్నా బిజినెస్ జెట్ విమానాలనే వాడనున్నాయని షాంగై కేంద్రంగా వెలువడుతున్న 'ఏరోస్పేస్' తన ఏవియేషన్ ఔట్ లుక్ నివేదిక పేర్కొంది. 2014లో విమానాల ధరలతో పోలిస్తే, వచ్చే పదేళ్లలో 3 నుంచి 5 శాతం వరకూ ధరలు తగ్గనున్నాయని అంచనా వేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ 700 బిజినెస్ జెట్ విమానాల డెలివరీ జరిగిందని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరగనుందని తెలిపింది. మొత్తం జెట్ విమానాల్లో 48 శాతం వరకూ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలకు డెలివరీ కానున్నాయని పేర్కొంది. కొత్త విమానాలకు ఆర్డర్ల విషయంలో బ్రెజిల్ శరవేగంగా పరుగులు పెడుతుండగా, చైనా, రష్యాల గణాంకాలు గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా మెరుగుపడ్డాయని తెలిపింది.

  • Loading...

More Telugu News