: ఆనం వారి రాకపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి, ఆపై కాంగ్రెస్ కు మారి, తిరిగి ఇప్పుడు సొంత గూటికి వెళ్లాలనుకుంటున్న నెల్లూరు జిల్లా సోదరద్వయం ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆనం సోదరుల పునరాగమనంపై తాను చంద్రబాబుతో మాట్లాడినట్టు ఏపీ మంత్రి నారాయణ ఈ మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు. వారిద్దరికీ తమ పార్టీ స్వాగతం పలుకుతోందని అన్నారు. అందరమూ కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కాగా, బొత్స సత్యనారాయణతో సత్సంబంధాలు ఉన్న ఆనం సోదరులు తొలుత వైకాపాలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, అక్కడికి వెళ్లలేకనే టీడీపీని ఎంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న వివిధ నియోజకవర్గాల కార్యకర్తలు, అనుచరులతో చర్చలు జరిపిన ఆనం బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలో చేరాలన్న ఒత్తిడి తమపై ఉందని మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.