: జైల్లో ఉన్న హిందువులు బయటకు వచ్చేందుకు రూ. 50 వేలు సేకరించిన ముస్లింలు
ఓవైపు 'అసహనం' పేరిట రాద్ధాంతం జరుగుతున్న వేళ, జైల్లో మగ్గుతున్న 15 మంది హిందువుల కోసం ముస్లింలు నిధుల సమీకరణకు దిగి రూ. 50 వేలను సేకరించారు. ఈ ఘటన బరేలీలో జరిగింది. జైల్లోని వారంతా టికెట్ లేకుండా ప్రయాణాలు వంటి చిన్న చిన్న పెట్టీ కేసుల్లో ఇరుక్కున్న వారే. వీరు జరిమానాలు కట్టలేక నెలల తరబడి కరుడుగట్టిన ఖైదీల మధ్య కాలం గడుపుతున్నారు. వీరందరి జరిమానాలను కొందరు ముస్లింలు సేకరించి కట్టగా, మొత్తం 15 మంది జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. వీరిలో కొంతమంది తమకు విధించిన పూర్తి శిక్షాకాలాన్ని ముగించి కూడా, జరిమానా కట్టలేక జైల్లోనే ఉండిపోయిన వారు ఉన్నారు. కోర్టు విధించిన జరిమానా కట్టలేని వారెందరో జైల్లో ఉన్నారని బరేలీ జైలు సూపరింటెండెంట్ బీఆర్ మౌర్య వెల్లడించారు.