: మరింత పెరిగిన భారత నౌకాదళం శక్తి
శత్రు జలాంతర్గాములను చీల్చి చెండాడే అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ కదమత్ భారత నేవీ అమ్ముల పొదిలో చేరడంతో నౌకాదళం శక్తి మరింతగా పెరిగినట్లయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధనౌకను నాకాదళానికి లాంఛనంగా అప్పగించారు. 109 మీటర్ల పొడవైన ఈ యుద్ధనౌక గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో నీటిపై దూసుకువెళుతుంది. 3,200 టన్నుల బరువుతో ఉండే నౌక, రాకెట్ లాంఛర్లు, చాపర్లు, ఆణ్వాయుధాలను, విమాన విధ్వంసక క్షిపణులను తీసుకెళ్లగలదు. జలాంతర్గాములను గుర్తించి వాటిని నాశనం చేయడం ఈ యుద్ధనౌక ప్రత్యేకత.