: టీఆర్ఎస్ దొరల పార్టీ... వైసీపీ భూస్వాముల పార్టీ: టీడీపీ నేత కాల్వ కామెంట్


టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ గా కొనసాగుతున్న కాల్వ శ్రీనివాసులు నిన్న కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రత్యర్థి పార్టీ వైసీపీపై నిత్యం నిప్పులు చెరిగే ఆయన నిన్న మాత్రం వైసీపీతో పాటు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పైనా విరుచుకుపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నిన్న హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ జయంతి (నవంబరు 26)ను రాజ్యాంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బడుగు బలహీన వర్గాలకు ఊరట కలిగించే విషయమని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. తదనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ ను పార్ట్ టైం నేతగా అభివర్ణించారు. వీలున్నప్పుడే జగన్ ప్రజలను పరామర్శిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News