: ‘డబుల్ బెడ్ రూమ్’ విధి విధానాల్లో మార్పులు!


తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం విధి విధానాల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం జిల్లా మంత్రి అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో కన్వీనర్ గా జిల్లా కలెక్టర్, సభ్యులుగా ఎమ్మెల్యేలు ఉండనున్నారు. గ్రామ, వార్డు స్థాయి సభలు నిర్వహించి పేదల నుంచి దరఖాస్తులను ఆ కమిటీ స్వీకరిస్తుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. కాగా, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక విధానం సక్రమంగా లేదని, గత నెల 15న తెలంగాణ గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకుని కొత్త జీవోను జారీ చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ సర్కార్ కు హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News