: ఇది క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదకరం: 'చెత్త వికెట్'పై రాహుల్ ద్రవిడ్
ప్రపంచంలో అత్యంత పటిష్ఠమైన సౌతాఫ్రికా జట్టును ఓడించే సత్తా లేక వన్డే, టీట్వంటీలు ఓడిపోయిన టీమిండియా, కనీసం టెస్టుల్లోనైనా నెగ్గారనే పేరు కోసం స్పిన్ వికెట్ తయారు చేయాలంటూ క్యూరేటర్లపై ఒత్తిడి తెచ్చి అంత్యంత చెత్త వికెట్ ను రూపొందించి విజయం దిశగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. రంజీల్లో అతిగా టర్న్ అయ్యే పిచ్ లపై బౌలర్లు ఏడు వికెట్లు తీసినా ఆ ప్రతిభ వేస్టని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. అలాంటి పిచ్ లు తయారు చేయడం వృథా అని పేర్కొన్నాడు. ఇది క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన చెప్పారు. దేశంలో అలాంటి పిచ్ లపై రాణించిన ఆటగాళ్లు విదేశాల్లో చేతులెత్తేస్తారని, అలాంటి వారి వల్ల ఉపయోగం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అలాంటి పిచ్ ల తయారీకి సమయం, డబ్బు వృథా అని తెలిపాడు. ఒకవేళ ఫలితం కోసం అలాంటి పిచ్ లు కావాలంటే నాకౌట్ దశలో అలాంటి పిచ్ తయారు చేయడం ఆమోదించవచ్చని ద్రవిడ్ స్పష్టం చేశాడు. సంప్రదాయ పిచ్ లపై రాణించే ఆటగాడే ప్రతిభ ఉన్నవాడని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.