: చింటూ సహా పలువురి ఇళ్లలో మారణాయుధాలు స్వాధీనం!


చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. చింటూ సహా పలువురి ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సీకే బాబు ప్రధాన అనుచరుడు గుర్రప్ప సహా వైఎస్సార్సీపీ నేత విజయానంద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత బులెట్ సురేశ్ ఇళ్లలో సోదాలు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, కఠారి అనూరాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మంది నిందితులు ఉన్నారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు అందజేస్తామని అడిషనల్ డీజీ ఆర్పి ఠాకూర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News