: తెలంగాణలో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!
తెలంగాణలో ప్రైవేటు విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఒక ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు బిల్లు తీసుకువస్తామని అన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఎంతో అనుగుణంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.