: ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు చెక్ పెట్టాం: సీఎం చంద్రబాబు


ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇసుక అక్రమాలకు తావులేకుండా వాహనాలకు జీపీఎస్ విధానంతో నియంత్రణ, ఇసుక రీచ్ లలో సీసీ టీవీల వినియోగం, అన్ని జిల్లాల్లోని రీచ్ లలో తవ్వకాలు తెలుసుకునేందుకు విజయవాడలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇసుక అమ్మకాల ద్వారా ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలను తెలియజేశారు. కృష్ణా జిల్లాలో రూ.140 కోట్లు, గుంటూరులో రూ.134 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.118 కోట్లుగా బాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News