: బీహార్ లో మద్య నిషేధం... ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని నితీశ్ ప్రకటన


గడచిన రెండు టెర్మ్ ల పాలనలో బీహార్ లోని తుపాకుల సంస్కృతికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెక్ పెట్టేశారు. గుండారాజ్ ను కాలి కింద వేసి తొక్కేశారు. ఫలితంగా మొన్నటి ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క గొడవ కూడా జరగలేదు. ప్రజలు నిర్భయంగా ఓటేశారు. భారీ పోలింగ్ శాతం నమోదైంది. సంస్కరణలకు బీజం వేసిన నితీశ్ కే మళ్లీ ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఈ నెల 20న నితీశ్ ముచ్చటగా మూడో టెర్మ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. వెనువెంటనే సంస్కరణ కత్తిని బయటకు తీసిన ఆయన ఈ సారి లిక్కర్ పై దూశారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ఆయన కొద్దిసేపటి క్రితం పాట్నాలో ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి పకడ్బందీగా మద్య నిషేధాన్ని అమలు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News