: ‘రాసలీల’ల టీచర్ పై అత్యాచారం కేసు నమోదు...చర్యలకు విద్యాశాఖ సన్నాహాలు


పదో తరగతి చదువుతున్న విద్యార్థినితో లాడ్జీలో రాసలీలల్లో మునిగిన ఖమ్మం జిల్లా టీచర్ నాగేశ్వరరావుపై అత్యచారం కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న నాగేశ్వరరావు తాను పనిచేస్తున్న పాఠశాలకు చెందిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జీకి తీసుకొచ్చాడు. నిన్న రాత్రి పోలీసుల రైడింగ్ లో అతడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబం అక్కడకు చేరుకుని నాగేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమాయకురాలైన తమ కూతురుకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని ఆ ఫిర్యాదులో బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో నాగేశ్వరరావుపై అత్యాచారం ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థినిని లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై కఠిన చర్యలకు విద్యా శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News