: ఇండియాలో రిజర్వేషన్లపై రాజ్ నాథ్ సంచలన వ్యాఖ్యలు!
భారత రాజ్యాంగాన్ని రచిస్తున్న సమయంలో ఆర్థిక అసమానతలు గుర్తెరిగిన అంబేద్కర్ రిజర్వేషన్లను ప్రస్తావించారే తప్ప, రాజకీయ కోణంలో కాదని, వాటిని కొనసాగిస్తూ, వచ్చిన గత ప్రభుత్వాలు ఇతర వర్గాల ప్రజల్లో తీవ్ర భయాన్ని పెంచాయని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు లోక్ సభలో దుమారాన్ని రేపాయి. ప్రజల మధ్య సామాజిక సమానత్వం కోసం ఆయన పరిచయం చేసిన రిజర్వేషన్లు, ఇప్పుడు ఓట్లు సాధించి పెట్టే అస్త్రాలుగా మారాయని అన్నారు. రాజ్యాంగపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన రిజర్వేషన్లు ప్రతిపాదించారని చెప్పారు. రాజ్ నాథ్ వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, వారి వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి చేరవని స్పీకర్ ప్రకటించారు. భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకికం అన్న పదాలను అంబేద్కర్ చేర్చలేదని, బహుశా అవి భారతీయుల మనసుల్లో ఉన్నాయని ఆయన భావించి వుండవచ్చని రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. లౌకికం అన్న పదాన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేశాయని ఆరోపించారు.