: ఎన్నాళ్లకెన్నాళ్లకు... 83 రోజుల తరువాత సచివాలయానికి చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 83 రోజుల తరువాత సెక్రటేరియట్ కు రానున్నారు. సెప్టెంబర్ 5 న హైదరాబాదులోని సచివాలయం ఎల్ బ్లాకులోని తన కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం చంద్రబాబు తిరిగి అక్కడ మరోసారి కాలుపెట్టలేదు. తన క్యాంపునంతటినీ అమరావతి ప్రాంతానికి తరలించి, అక్కడినుంచే పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదుకు వస్తున్న చంద్రబాబు 28వ తేదీన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉద్యోగుల తరలింపుతో పాటు వివిధ పథకాల అమలు, ఆదాయం వంటి విషయాలూ వీరిమధ్య చర్చకు వస్తాయని తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17 నుంచి జరుగనున్న నేపథ్యంలో, 18న షెడ్యూల్ లో ఉన్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మీటింగ్ సైతం హైదరాబాద్ లోనే జరుగనుంది.