: నా బెడ్ రూం విషయాలు మీకెందుకు?.... బీబీసీపై సానియా మీర్జా గుస్సా!
పెళ్లై ఐదేళ్లు దాటిపోతున్నా, పిల్లలు లేరుగా? అన్న ప్రశ్నలపై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో సానియా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సానియాతో పాటు షోయబ్ కూడా క్రీడా జీవితంలో బిజీబిజీగానే ఉన్నారు. ఈ క్రమంలో తల్లి ఎప్పుడు అవుతారంటూ సానియాకు పలు సందర్భాల్లో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ తరహా ప్రశ్నలపై మొన్నటిదాకా కాస్తంత సావధానంగానే సమాధానాలు చెప్పిన సానియా తాజాగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఇటీవల బీసీసీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనూ ఇదే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీంతో ఆమె అంతెత్తున ఎగిరిపడింది. ‘‘నా బెడ్ రూంలో ఏం జరుగుతుందో అడిగే హక్కు ఎవరికీ లేదు’’ అంటూ ఆమె బీబీసీ ప్రజెంటర్ కు ఘాటుగా సమాధానం చెప్పారు.