: ‘శీతాకాల’ సమరం!... మరికాసేపట్లో పార్లమెంటు సమావేశాలు


పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు మొదలు కానున్న సమావేశాలు వచ్చే నెల 23 దాకా కొనసాగుతాయి. మత అసహనంపై బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సభలో వాడీవేడీ చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని విపక్షాలు స్పీకర్ కు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. మరోవైపు మత అసహనంపై చర్చకు తాము సిద్ధమేనని నిన్న నరేంద్ర మోదీ సర్కారు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో మరింత వాడీవేడీ చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇక జీఎస్టీ లాంటి కీలక బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం చేస్తున్న యత్నాలను సమర్థిస్తూనే, తమ సూచనలను అందులో చేర్చాలని విపక్షాలు వాదిస్తున్నాయి. దీంతో పలు కీలకాంశాలపై పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర చర్చ జరగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News