: లేడీ డ్యాన్సర్ తో కలిసి డిప్యూటీ మేయర్ చిందులు!... సోషల్ మీడియాలో వీడియో హల్ చల్
విద్యుత్ వెలుగులతో జిగేల్ మంటున్న ఓ వేదికపై లేడి డ్యాన్సర్ తో కలిసి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు డిప్యూటీ మేయర్ వెంకటరత్నం చిందులేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించారన్న కేసులో అరెస్టైన వెంకటరత్నం బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఇటీవల ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ కుటుంబం ఇచ్చిన ఓ పార్టీకి మరికొందరు కార్పోరేటర్లతో కలిసి వెంకటరత్నం హాజయ్యారు. సంగీత విభావరి తరహాలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్ లో ఓ యువతి చేయి పట్టుకుని వెంకటరత్నం స్టెప్పులేశారు. దీనికి సంబంధించి గుట్టుచప్పుడు కాకుండా వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని ఫేస్ బుక్, వాట్సాప్ లలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.