: ఢిల్లీ పాఠశాలల్లో రెండు షిఫ్ట్ లు: మంత్రి మనీష్ సిసోడియా


విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి క్లాసులను రెండు షిప్టుల్లో నడిపించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. ఈ తరహా ప్రభుత్వ పాఠశాలలను ఢిల్లీలో ఐదింటిని గుర్తించామన్నారు. ఈ పాఠశాలల్లో రెండు విడతల్లో తరగతులు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు చెప్పారు. విద్యార్థుల సంఖ్య పరిమితిని మించి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో తరగతిలో 50మందికి పైగా విద్యార్థులున్నట్టు సిసోడియా చెప్పారు.

  • Loading...

More Telugu News