: బాసర ఆలయంలో కార్తీకదీప కాంతులు
ఆదిలాబాద్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మ వారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. కార్తీకదీప కాంతులతో బాసర ఆలయం మరింత మెరిసిపోయింది. కార్తీక దీపోత్సవంలో భాగంగా గోదావరి నదికి దీపారాధన చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కార్తీక దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అమ్మవారి అనుగ్రహం కోసం జ్ఞాన సరస్వతి దీక్ష తీసుకున్న భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు.