: నిన్న పారిస్...రేపు మాస్కో: ఐఎస్ఐఎస్ హెచ్చరికలు


రష్యాలోని కల్జోస్కో-రిజాస్కోయా మార్గంలోని రైల్వే స్టేషన్ లో వైఫై వినియోగదారులకు వచ్చిన మెసేజ్ తో అంతా షాక్ కు గురయ్యారు. ఆ రైల్వే స్టేషన్ లోని వైఫై నెట్ వర్క్ ను హ్యాక్ చేసిన దుండగులు మారణహోమం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో వైఫై కోసం మొబైల్ సెర్చ్ చేసిన వారికి 'నిన్న పారిస్, రేపు మాస్కో' అన్న సందేశంతో బాటు ఐఎస్ఐఎస్ చిహ్నం కనిపించింది. దీనిని చూసిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇక్కడ నెట్ వర్క నిర్వహిస్తున్న మాక్సిమ్ కంపెనీ మాత్రం తమ నెట్ వర్క్ లో లోపం లేదని చెబుతోంది.

  • Loading...

More Telugu News