: గెలుపు గర్వాన్ని తలకెక్కించుకోవద్దు: పార్టీ నేతలతో సీఎం కేసీఆర్


గెలుపు గర్వాన్ని తలకెక్కించుకోవద్దని, వీలైనంత వరకు అణకువగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ నేతలకు సూచించారు. వరంగల్ లో విజయం సాధించిన పసునూరి దయాకర్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలతో వినయంగా ఉండాలని, సంయమనం పాటించాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమానికి ఎప్పుడూ అండగా ఉండే వరంగల్ ప్రజలు, ఈసారి కూడా తమ ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు.

  • Loading...

More Telugu News