: మహిళ నిర్ణయాన్ని గౌరవించిన బాంబే హైకోర్టు
బాంబే హైకోర్టు ఓ మహిళ అభీష్టాన్ని గౌరవిస్తూ తీర్పు వెలువరిచింది. రాజస్థాన్ కు చెందిన ఓ కేసు బాంబే హైకోర్టులో విచారణకు వచ్చింది. గత జూన్ లో రాజస్థాన్ కు చెందిన జంట మధ్యప్రదేశ్ లోని ఉజ్జయనికి పారిపోయి వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి గుజరాత్ కు చెందిన మరో వ్యక్తికిచ్చి వివాహం చేసేశారు. దీంతో తన భార్య (గర్భవతి) తప్పిపోయిందంటూ ఆమె మొదటి భర్త (ప్రియుడు) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించి, తన భార్యను పోలీసుల సాయంతో అప్పగించాలని కోరాడు. అతని కోరిక మన్నించిన న్యాయస్థానం అతని భార్యను వెతికి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆమెను తీసుకువచ్చి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం తల్లిదండ్రుల దగ్గర ఉంటావా? మొదటి భర్త దగ్గరకు వెళ్తావా? అని ఆమెను ప్రశ్నించింది. దీంతో ఆమె తన మొదటి భర్త దగ్గరే ఉంటానని స్పష్టం చేసింది. దాంతో ప్రేమ జంట కలిసి జీవించేలా కోర్టు తీర్పు ఇచ్చింది.