: దేశంలో సహనశీలత ఉంటే ఆమిర్ ఖాన్ పై ఇంతలా విరుచుకుపడేవారా?: ఫరా ఖాన్ ప్రశ్న


అందరూ చెబుతున్నట్టు సహనశీలత ఉంటే ఆమిర్ ఖాన్ పై ఇంతలా విరుచుకుపడేవారా? అని ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ సూటిగా ప్రశ్నించారు. ముంబైలో ఆమె మాట్లాడుతూ, దేశంలో అసహనం పెరుగుతోందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరమా? అని నిలదీశారు. ఆమిర్ ఖాన్ పై విమర్శలకు బదులు సానుకూల ప్రకటన వెలువడి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, తాను చేసిన అసహనం వ్యాఖ్యలపై ఆమిర్ ఖాన్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News